పాహి పాహి పార్వతి పుత్రునకు పాహి పాహి
పాహి మాం పాహి మాం పర్వతరాజా దౌహీత్రునకు పాహి మాం
నేరపవయా ఫౌరోహీత్యం అల్లూరిరాజు రామకధల కధనానికి
కడు రమ్యంగా గానం చేయుటకై ప్రారంభించు ఈ కావ్యాన్ని
వీక్షించి, పర్య వేక్షించి, అద్దానికి సాక్షివై ప్రేక్షకుడవై
విఘ్నములు లేకుండా చూడుమని విన్నవించుకొంటూ
వందనం సమర్పించుకొంటున్నా విఘ్నేశ్వరా!
వందనం వాల్మీకి మహర్షికి వందనం
వందనం కవికొకిలకు శతవందనం
రామకథ నీ గంటమున రమణీయ కావ్యంగా అవతరించింది
నీ ప్రతిభాపాటవం పట్టుదలతో ఒక సంస్కృతిని అందించింది
నీవు మాన్యుఢవు గాని సామాన్యుఢవు కావు
నీవు మాకు కల్పించావు ఒక వందనం
అందుకు కృతజ్ఞతగా తీసుకో మయ వందనం
బోయవో, కోయావో, ఎవరివైతే నేమి?
నిమ్నజతిలో పుట్టిన (నిత్య) జాతి రత్నానీవి
మెనులొ లేదు మాన్యత మనసులో ఉందని చెప్పిన మనస్వి వి
వర్ణవ్యవస్థ అక్కరలేదన్న స్వర్ణ సరస్వతి వీణవు, యశస్వివి
భరతభూమికి రమకధామృతధారా ప్రదాతవు
ఆది కావివి, ఆర్ష కావివి, అందుకో మా ఆత్మియవందనం!
అలనాడు నీవు లిఖించావు రామకథను అన్నికాలాలకూ
నేటి కాలానికి ప్రజల కనుకూలంగా నేను పలుకుతున్నాను
నీ అంతటి రమ్యంగా కాకున్నా, రాముడంత వేదంలా లేకున్నా
గీర్వాణ౦ నా నోటికి రాకున్నా, నీ అనుగ్రాహాంకోసం ప్రార్ధిస్తున్న!
అనుమతిని ప్రసాదించుమనీ ఆర్ధిస్తున్నా!
తెనుగులో నాచేత పలికించుమని వేడుకొంటున్నా!!
నీవు నిర్మించిన రామాయణం భారతీయభాషాకవులకు పారాయణం
ఎందరో మహాకవులు ఎన్నో రూపాల రామకథను పాడుకొన్నారు
అదొక పెద్ద వారసత్వం; అదొక రమణీయ కావ్యతత్వం
మొల్లవంటి తల్లులు కూడా పాడుకొన్న చల్లని గీతం
పండితులు పద్యాలు వ్రాస్తే పామరులు పాటలు పాడుకొన్నారు
నాకు నచ్చిన వరసలో పాడుకొంటున్నా
అందుకు నీ అండదండలను కోరుకోంటున్నా!